ప్రైవేట్ కంపెనీ కాదు.. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం

by Anukaran |   ( Updated:2021-09-24 00:24:02.0  )
ప్రైవేట్ కంపెనీ కాదు.. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్‌ పార్టీ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యం‌లో ఇవాళ కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ పీసీసీ కాకముందే నేను మూడు సార్లు ఎమ్మెల్యేనీ అయ్యానంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఆవేశంతో ఊగిపోయిన ఆయన, ఇది కాంగ్రెస్ పార్టీనా.. ? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ మండిపడ్డాడు. చర్చలేకుండానే 2 నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. జహీరాబాద్‌లో కార్యక్రమాలపై గీతా రెడ్డికి సమాచారం ఇవ్వరా , సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ నైన నాకే సమాచారం ఇవ్వరా అంటూ నిలదీశాడు. కనీసం ప్రోటోకాల్ పాటించరా.. నాతో విభేదాలు ఉన్నట్లు రేవంత్ చెప్పాలని అనుకుంటున్నాడా ?.. ఎప్పుడు కాంగ్రెస్‌లో ఏ ఒక్కరో హీరో కాలేరని కాంగ్రెస్ నాయకులపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story