- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికారులు రిటైర్ అయినా వదలిపెట్టం
దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే సిద్దిపేట కలెక్టర్ పదవి విరమణ అయ్యాక కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మరణించినట్లే, చెరుకు శ్రీనివాస్రెడ్డి తండ్రి చెరుకు ముత్యంరెడ్డి మరణించారని.. అక్కడ భార్య ఉంటే, ఇక్కడ కొడుకు బరిలో ఉన్నారని తెలిపారు. రామలింగారెడ్డి మరణం బాధాకరమన్న జగ్గారెడ్డి.. దుబ్బాక అభివృద్ధిలో చెరుకు ముత్యం రెడ్డి మాత్రమే కనిపిస్తారని అన్నారు. చెరుకు శ్రీనివాస్రెడ్డికి దుబ్బాక ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవరిస్తున్నారని, ఆయనను వెంటనే బదిలీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.