‘గాంధీకి 10 మంది వెళితే ఐదుగురే బతుకుతున్నారు’

by  |
‘గాంధీకి 10 మంది వెళితే ఐదుగురే బతుకుతున్నారు’
X

దిశ, సగారెడ్డి: కరోనా రోగుల విషయంలో ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కట్టడంలో బిజీగా ఉంటే.. సీఎస్ సోమేశ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ నిజాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతికున్నప్పుడు సరైన చికిత్స లేదు.. చనిపోతే శవాన్ని కుటుంబాలకు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ హాస్పిటల్‌కు పది మంది వెళ్తే.. ఐదుగురు మాత్రమే బతుకుతున్నట్లు ఆయన అన్నారు. అబ్దుల్ కయిమ్ అనే వ్యక్తి ఆక్సిజన్ అందకపోవడం వల్లే మరణించాడని తెలిపారు. వైద్య శాఖ కేవలం బులిటెన్‌కే పరిమితమయిందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో మంత్రి ఈటల, సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.



Next Story