టీఆర్‌ఎస్‌, బీజేపీది చీకటి ఒప్పందం : జగ్గారెడ్డి

by Shyam |
టీఆర్‌ఎస్‌, బీజేపీది చీకటి ఒప్పందం : జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజకీయ చీకటి ఒప్పందం ఉందని, ఈ రెండు పార్టీ మధ్య సఖ్యత కొనసాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బీజేపీని విమర్శించి, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని మెచ్చుకుంటారని మండిపడ్డారు. గాంధీభవన్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కొత్త సచివాలయాన్ని కడుతున్నందునే ఢిల్లీలో మోడీ నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనాన్ని సమర్థిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదని, సంగారెడ్డి, దుబ్బాకలో మాత్రమే కాంగ్రెస్​, బీజేపీ సభ్యులమున్నామని, సిద్దిపేట, గజ్వేల్​ మినహాయిస్తే మిగిలిన 6 సెగ్మెంట్లలో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ సెగ్మెంట్లకు కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. ఆరేళ్లుగా సంగారెడ్డికి నిధులు ఇవ్వడం లేదని, కేసీఆర్‌ లేనిదే తెలంగాణ లేదనడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ ఇలా మాట్లాడేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed