- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ మంత్రితోనే సంగారెడ్డిలో కరోనా వ్యాప్తి : జగ్గారెడ్డి
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఆ మంత్రి తమ ప్రాంతానికి వస్తే కరోనా కూడా వచ్చినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మంత్రి హరీశ్ రావు వివిధ కార్యక్రమాల పేరుతో సంగారెడ్డికి వచ్చిన సమయంలో ఆయన వెంట వందల మంది ఉంటారని, ఆ సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మంత్రి తన నియోజకవర్గానికి రావద్దని కోరారు. మీ రాజకీయం, ఇమేజ్ కోసం సంగారెడ్డి ప్రజలను చంపుతారా అని మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తన పాపులారిటీని తగ్గించాలని హరీశ్ రావు అనుకుంటే… వెంటనే నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని సవాల్ విసిరారు.
Next Story