ఎమ్మెల్యేను.. నాకే హాస్పిటల్‌లో బెడ్ దొరకలేదు

by Shyam |
ఎమ్మెల్యేను.. నాకే హాస్పిటల్‌లో బెడ్ దొరకలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రోగులకు సరైన వైద్యం అందక చనిపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ గౌసియా బేగం కరోనా సోకడంతో గత ఐదు రోజుల నుంచి ఆసుపత్రుల చుట్టు తిరిగినా ఎక్కడా బెడ్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ఆక్సిజన్ అందక ఆమె మృతి చెందినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా తాను ఎంతగా ప్రయత్నించినా ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో కౌన్సిలర్‌ను కాపాడుకోలేకపోయానని, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే బాధేస్తుందని జగ్గారెడ్డి అన్నారు. జిల్లా మంత్రి కరోనాతో కోలుకున్న వారికి ఫోన్ చేయడం కాదు.. హాస్పటల్స్‌లో పరిస్థితులను తెలుసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed