హరీశ్‌రావు‌పై జగ్గారెడ్డి ఫైర్

by Shyam |
హరీశ్‌రావు‌పై జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు నీళ్ల దొంగ అంటూ విమర్శలు చేశారు. సింగూరు నీళ్లను సంగారెడ్డికి రాకుండా అడ్డుకున్నారని శనివారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో విమర్శించారు. మూడేళ్లుగా సంగారెడ్డి ప్రజలు నీళ్లకోసం అల్లాడిపోతుంటే జిల్లా అధికారులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం వల్లే నీళ్ల కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు. సింగూరు డ్యామ్‌ను నింపే కార్యాచరణ ఏమైందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed