సరదాగా కాసేపు.. ప్రజలతో ఎమ్మెల్యే..!

by Shyam |
mla hanmanth sinde
X

దిశ, పిట్లం(జుక్కల్) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం ప్రజలతో సరదాగా కాసేపు ముచ్చటించారు. స్థానికంగా ఉన్న చాయ్ షాపులో గ్రామ పెద్దలతో సంభాషించారు. అలాగే ప్రజలతో గ్రామంలోని సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై గ్రామస్తులతో మాట్లాడారు. హుజురాబాద్‌లో దళితబంధు పథకం పై ప్రవేశపెట్టడానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలోని దళితులను ధనికులుగా మార్చే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకం తీసుకొచ్చారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న ముఖ్యమంత్రి దళితులకు కోసం దళిత బంధును ప్రవేశపెట్టారని కొనియాడారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరీని పలకరించి, వారితో కలిసి టీ తాగి ముచ్చటించారు.



Next Story

Most Viewed