జర్నలిస్టుని బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Anukaran |   ( Updated:2023-08-08 08:45:44.0  )
జర్నలిస్టుని బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఓ విలేకరి వరుస కథనాలు ప్రచురించారు.

దాంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు అతనిపై దాడికి యత్నించినట్లు సమాచారం.దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జర్నలిస్టుపై ఎమ్మెల్యే బూతు పురాణం ఆడియో కోసం కింద ఉన్న వీడియో క్లిక్ చేయండి.

Advertisement

Next Story