- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్యకర్తలే పార్టీకి బలం.. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా..!
దిశ, భూపాలపల్లి : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి బలం, పునాదిరాయి లాంటి వారని.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీకార్యకర్త సింహంలా పార్టీకి అంకితభావంతో పనిచేయాలని అప్పుడే తెరాస పార్టీ రాష్ట్రంలో ఇంకా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి నడిపించడంలో తెరాస పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా కార్యకర్తలకు గుర్తుచేశారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పార్టీ సభ్యత్వం ఎక్కువ మందిని చేర్పించి, గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలని సూచించారు, సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు వార్డు గ్రామ కమిటీల ఎన్నుకోవాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు పట్టణ కమిటీలు, దాని అనుబంధ కమిటీలను నియమిస్తామన్నారు. కమిటీ ఎన్నికలో అనుభవజ్ఞులను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వారిని ఎన్నుకోవాలని, అలాంటప్పుడే పార్టీకి పల్లెల్లో బలం ఉంటుందన్నారు.
రేగొండను రెండు మండలాలుగా చేస్తాం..
జిల్లాలో అతిపెద్ద మండలంగా ఉన్న రేగొండను రెండు మండలాలుగా విభజిస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేగొండ మండల వాసులకు హామీ ఇచ్చారు. రేగొండ మండలం పెద్దగా ఉండటంతో ప్రజలు పాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల అవసరాల దృష్ట్యా రెండు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు మండలాలుగా విభజన జరిగేలా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.