- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గుండుగా సంజయ్’ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే నిలువునా చీరేస్తా…!
దిశ, తుంగతుర్తి: కేసీఆర్ గురించి గుండుగాడు సంజయ్, అరవింద్ గాళ్లు అవాకులు చెవాకులు పేలితే నిలువునా చీరేస్తా కొడకా..! అంటూ తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తుంగతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి హాజరై అధ్యక్షోపన్యాసం చేశారు. బీజేపీకి చెందిన బండి సంజయ్, అరవిందు తోపాటు కేంద్ర నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తూ విమర్శించారు. ఎన్నికలకు ముందు పసుపు బోర్డు తెస్తానంటూ గెలిచి పారిపోయిన బండి సంజయ్ నిజమాబాద్ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసిన వెధవ, దద్దమ్మ, చవట అంటూ దుమ్మెత్తిపోశారు.
ఒరేయ్ గుండు సంజయ్, అరవిందు గాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నిట్టనిలువునా చీరేస్తాం అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులతో జైలుకు పోయి వచ్చిన నాకు మిమ్మల్ని బట్టలు ఊడదీసి నేనే కొడతా నంటూ రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం, రైతులు తలుచుకుంటే గుండుగాడు సంజయ్, అరవింద్ గాని బయట తిరుగుతారా? అంటూ హెచ్చరించారు. కెమెరాలు కనబడగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అంటూ బీజేపీ చెందిన కేంద్ర రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఈ ప్రపంచానికే విప్లవ పాఠాలు నేర్పిన గడ్డ తుంగతుర్తి కొడకా.. తస్మాత్ జాగ్రత్త..! అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.