- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వానికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఎందుకంటే ?
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. కృష్ణా జిల్లా మెుగల్రాజపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేయకూడదన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తుగ్లక్ చర్యతో పోల్చారు. వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వినాయక చవితిపై ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు.
ఏపీ ప్రభుత్వం రద్దుల, బ్యాన్‌ల ప్రభుత్వంలా మారిందని విమర్శించారు. పార్టీ కార్యక్రమాలకు, వైఎస్ వర్ధంతి వేడుకలకు కొవిడ్ అడ్డు రాలేదు కానీ, వినాయకచవితి వేడుకలకు వచ్చేస్తోందా అని నిలదీశారు. దీనిపై సీఎం జగన్‌కు బహిరంగ లేఖ సైతం రాసినట్లు గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా వినాయక చవితిని బహిరంగ ప్రదేశాల్లోనే నిర్వహించి తీరుతామని చెప్పుకొచ్చారు. ఇలాగే చేయాలని ప్రజలకు కూడా పిలుపునిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ మేల్కొని బుధవారం సాయంత్రంలోపు చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేస్తామని బోండా ఉమా హెచ్చరించారు.