బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Shyam |
బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, మెదక్: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు చేపట్టిన లాక్‎డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం , 1500 రూపాయల నగదు అందజేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ 21వ వార్డులో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర సమయంలో పేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రేషన్ కార్డు లేని వలస కార్మికులు కూలీలకు 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయలు నగదు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ ఉన్న సమయంలో తమ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు .

Tags: MLA Mahipal Reddy, distributed, rice, poor people, patancheru

Advertisement

Next Story