TRS MLA సార్ మీకు రూల్స్ వర్తించవా.. పెండింగ్ చలాన్లు చూసి పోలీసులు షాక్.!

by Anukaran |
TRS MLA సార్ మీకు రూల్స్ వర్తించవా.. పెండింగ్ చలాన్లు చూసి పోలీసులు షాక్.!
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిబంధనలకు విరుద్దంగా రోడ్డెక్కిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ప్రచారాలు, సంబురాల పేరిట ప్రజాప్రతినిధులు సైతం నిబంధనలు పాటించకుండా వాహనాన్ని నడుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.. సీఎం సహాయ నిధి చెక్కులను పంచేందుకు బైక్‌పై వెళ్తూ రూల్స్ బ్రేక్ చేశారు.

ఈ ఫోటో వైరల్ అవడంతో దాస్యం నడిపిన ద్విచక్రవాహనం చలాన్లు చెక్ చేయగా.. 5 పెండింగ్ చలాన్లు కనిపించాయి. అందులో అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, నెంబర్ ప్లేట్‌ను దాచేయడం ఇలా.. 5 చలాన్లు కలపి రూ. 2,540 ఉంది. ఈ వివరాలు కాస్తా నెటిజన్ల కంటపడటంతో ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని ప్రోత్సహించడం సరికాదని మండిపడుతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే, వారిని చూసి.. ఇతర వాహనదారుల్లో మార్పు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement
Next Story

Most Viewed