- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ దెబ్బకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం: నకిరేకల్ ఎమ్మెల్యే
దిశ, చిట్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని ఇది ముమ్మాటికీ కేసీఆర్ సాధించిన విజయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం చిట్యాల పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం పై హర్షిస్తూ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయాలంటూ, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా సెగ కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా తగిలిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించిండం ముమ్మాటికీ కేసీఆర్ సాధించిన విజయమని ప్రకటించారు. చిల్లరమల్లర వేషాలు వేసే బీజేపీ నాయకులకు నల్లగొండ జిల్లా రైతులు నల్లగొండ గడ్డ పౌరుషం చూపారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యిందని, చీకటి ఒప్పందాల రేవంత్ కు చిప్పకూడే గతి అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంసి చైర్మన్ జడలు ఆది మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.