పట్టభద్రులంతా పల్లా వైపే ఉన్నారు : చిరుమర్తి

by Shyam |
MLA Chirumarthi Lingaya
X

దిశ, నల్లగొండ: పట్టభద్రులంతా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే ఉన్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని నకిరేకల్ మినీ స్టేడియంలో నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్‌తో ఓట్లను అభ్యర్థించారు. నిరుద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అని, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి, ప్రశ్నించడమే కాదు ప్రశ్నకు సమాధానం వచ్చేవరకూ పోరాడుతారని తెలిపారు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల చేస్తున్న అసత్య ప్రచారాలపై, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను విడుదల చేశారని ఆ ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలెవ్వరన్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మరో 50 వేల ఉద్యోగాలు భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తుందని స్పష్టం చేశారు. అందుకు పట్టభద్రులంతా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేసి మద్దతు తెలపాలని కోరారు.

Advertisement

Next Story