పైసా ఖర్చు లేకుండా నిష్పక్షపాతంగా అందిస్తున్నాం : చిరుమర్తి

by Shyam |
MLA Chirumarthi Lingaiah
X

దిశ, నకిరేకల్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను పైసా ఖర్చు లేకుండా నిష్పక్షపాతంగా అందిస్తున్నామన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని 134 మంది లబ్ధిదారులకు కోటి 35 లక్షల చెక్కులను అందించామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే సంక్షేమ పథకాలతో దేశంలో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళ్తోందని అన్నారు. అదేవిధంగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉన్నారన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమారాణి, జెడ్పీటీసీ ధనలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed