మనోహర్ పంతులుకు ఎమ్మెల్యే చిరుమర్తి ఘన నివాళి

by Sridhar Babu |   ( Updated:2021-10-22 00:07:11.0  )
MLA-CHIRUMARTHI-LINGAIAH1
X

దిశ, రామన్నపేట: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రామన్నపేట మండల మాజీ జెడ్పీటీసీ, జనంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వేమవరం మనోహర్ పంతులు అనారోగ్యంతో కన్నుమూశారు. జనంపల్లి గ్రామంలో పంతులు పార్థివ దేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పంతులు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చిరుమర్తి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన చేసిన సేవలను పలువురు గ్రామస్తులతో ఎమ్మెల్యే చిరుమర్తి పంచుకున్నారు.



Next Story

Most Viewed