- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో దళితులకు అవమానం
దిశ , పరకాల: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి దళితులంటే ఎంత చులకన భావమో మరోమారు రుజువైంది. గతంలో రెడ్డి మహాసభలో దళిత అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ఎమ్మెల్యే దళితులకు క్షమాపణ చెప్పారు. తనకు దళితులు అంటే అభిమానం అని, తన మాటల్ని వక్రీకరించి మీడియా రాద్ధాంతం చేస్తుందని చెప్పారు. ఆ విషయానికి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే జనం మర్చిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం మున్సిపల్ కార్యాలయంలో పరకాల జిల్లా ఏర్పాటు విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ప్రజా ప్రతినిధులు అయిన జడ్పీటీసీ సిలువేరు మొగిలి, ఎంపీపీ తక్కల్లపల్లి స్వర్ణలతలు ఎమ్మెల్యే వెనకాల చేతులు కట్టుకుని నిలబడ్డారు. దళిత ప్రజాప్రతినిధులైన మొగిలి స్వర్ణలతలు అలా చేతులు కట్టుకుని నిలబడడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే తీరు మరోమారు చర్చనీయాంశంగా మారింది.