బీజేపీ ధరలు పెంచింది.. ఈటల ఓటెయ్యమంటే ఎలా..?: చల్లా ధర్మారెడ్డి

by Ramesh Goud |
బీజేపీ ధరలు పెంచింది.. ఈటల ఓటెయ్యమంటే ఎలా..?: చల్లా ధర్మారెడ్డి
X

దిశ, కమలాపూర్: నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలతో, పలు కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరలు పెంచి ప్రజలు బాధపడ్డా పర్వాలేదు కానీ, ఈటల నాకే ఓటేయాలని అంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోగానే గ్యాస్ సిలిండర్ ధర మరో రెండు వందల రూపాయలు పెంచి ప్రజలపై భారం మోపోతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో రైతులను ఆదుకున్నా ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. ఈటల రాజేందర్ ఏడేళ్లు మంత్రిగా చేసి నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టి ఇవ్వలేదని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఉద్యమ బిడ్డ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటేయాలని అభ్యర్థించారు.

Advertisement

Next Story

Most Viewed