ఎందుకు రాజీనామా చేశావ్.. ఈటలపై ఎమ్మెల్యే చల్లా ఆగ్రహం

by Shyam |
MLA Challa Dharma Reddy
X

దిశ, కమలాపూర్: మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం చల్లా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటేస్తే నష్టపోతామని, అదే టీఆర్ఎస్‌కు ఓటేస్తే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే ఈటల రాజేందర్ ఇంతటివాడు అయ్యాడని, కేసీఆర్ చలువతో అనేక పదవులు అనుభవించి, నమ్మకద్రోహం చేసి పార్టీ నుంచి వెళ్లిపోయాడని ఆరోపించారు. మరో రెండేండ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నా.. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి పేరియాల రవీందర్రావు, నాయకులు స్వర్గం రవి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed