వ్యవసాయాన్ని పండుగ చేసిన… ఏకైక సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2020-08-23 07:01:50.0  )
వ్యవసాయాన్ని పండుగ చేసిన… ఏకైక సీఎం కేసీఆర్
X

దిశ, కోదాడ: రైతుల కలలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మాధవరంలో పెద్ద చెరువు, వెంకటరామపురం ఎర్ర చెరువుల్లో అలుగు పోస్తుండటంతో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాలేశ్వరం జలాలతో చెరువులు కుంటలు నింపడంతో పాటు నిరంతరాయంగా నీళ్లు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.

గతంలో పాలించిన నాయకులు ఎన్నడూ ఈ రకంగా నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చిన నాటి నుంచి వ్యవసాయాన్ని పండగ చేశారని తెలిపారు. రైతులకు భరోసాగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాళేశ్వరం జలాలను ఒక నీటి బొట్టు కూడా వృథా కాకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. నీటిని సద్వినియోగం చేసుకొని రైతుల సమృద్ధిగా పంటలు పండించి అధిక లాభాలు పొందాలన్నారు. ప్రతిఒక్కరూ కరోనా నియంత్రణలు పాటించి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

Next Story