- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌లో చేరే వారికి ఎమ్మెల్యే బొల్లం కీలక ఆదేశాలు
దిశ, మోతె: టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పార్టీలో చేరే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. బుధవారం మోతె మండలం రావిపాడు గ్రామంలో వివిధ పార్టీల నుంచి 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం బొల్లం మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతులకు రైతుబంధు, నిరంతర విద్యుత్, పంటల బీమా అందిస్తోందని గుర్తు చేశారు. అలాగే పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్‌లు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి గ్రామాల రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పందిల్లపల్లి పుల్లారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షుడు ఎలమంచి, నాయకులు సురేందర్ రెడ్డి, దేవయ్య, ఉపేందర్, వినీష్ రావు, లింగయ్య, సైదులు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.