మరో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీ అధిష్టానం

by Shyam |   ( Updated:2021-02-20 05:02:53.0  )
మరో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీ అధిష్టానం
X

దిశ,వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి హత్యకేసులతో పాటు, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఆరోపణలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో హాట్ టాపిగ్గా మారాయి. పవర్ లో ఉన్నాం. అంతా మా ఇష్టం. అంతకు మించి సీతయ్యలమంటూ క్లారిటీ ఇచ్చారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. పోలీసులు, తహశీల్దార్లు ఇలా ఎవరైనా సరే తాము చెప్పింది వినాల్సిందేనంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా దయాదాక్షిణ్యాలు ఉంటేనే పోస్టింగ్ లో ఉంటారు. లేకపోతే తట్టా, బుట్టా సర్దుకుని పోవాల్సిందేనన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చ చేస్తున్నాయి.

Advertisement

Next Story