పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే సన్మానం

by Shyam |
పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే సన్మానం
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదివారం సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని 19వ వార్డులోని సుమారు 250 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ ప్రసన్నలక్ష్మి కోటిరెడ్డి, పోటు రంగారావు, డాక్టర్ శ్రీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: mla bollam mallaiah yadav, daily needs distribution, kodad

Advertisement

Next Story

Most Viewed