- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఈటలపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ హరీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సోమవారం ఈటల జమున ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె వ్యాఖ్యలపై చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. ఇప్పటికీ ఈటల బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఈటల ఒప్పుకోవాలని బాల్క సుమన్ సూచించారు. ప్రభుత్వ భూములతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, వెంటనే లాక్కున్న భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70.33 ఎకరాల భూమి ఈటల రాజేందర్ కబ్జా చేసినట్లు కలెక్టర్ తేల్చారని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ దగాకోరు.. ప్రభుత్వ భూములను దిగమింగారని సుమన్ మండిపడ్డారు.