- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్.. ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
by Anukaran |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. సామాన్యలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడే వచ్చిన ఫలితంలో ఆయనకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే… ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. తాను అందరికీ ఫోన్‌లో అందుబాటులోనే ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంతో అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని, కరోనా పట్ల నిర్లక్ష్యం కూడదని ఆయన పిలుపునిచ్చారు. తెనాలిలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ సహా అనేకమంది అధికారులు, పోలీసులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
Next Story