రైతు భరోసా పేరుతో రైతు దగా -అనగాని

by srinivas |
రైతు భరోసా పేరుతో రైతు దగా -అనగాని
X

దిశ, ఏపీ బ్యూరో: రైతుల గొంతుల్ని తడిగుడ్డతో కోస్తూ రైతు భరోసాతో ఏదో చేసేస్తున్నామని జగన్ ప్రభుత్వం ప్రకటించుకోవడం, ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదమని రేపల్లె శాసన సభ్యుడు అనగాని సత్య ప్రసాద్ ఓ ప్రకటనలో విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం 63లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. నాడు కోటి మంది రైతులుంటే కుదించేశారంటూ ప్రతిపక్ష నేతగా జగన్ రాద్దాంతం చేశారని చెప్పారు.

ఇప్పుడు అంతా తూచ్ అన్నట్లు 50లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారని, వారికి మాత్రమే రైతు భరోసా అంటూ రైతుల్ని దగా చేసినట్లు ఆరోపించారు. 15లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరించినట్లు తెలిపారు. అటవీ హక్కులు పొందిన గిరిజనులు, కౌలు రైతులు కేవలం లక్ష మందేనా అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రైతులు వరదలకు భారీగా నష్టపోతే కనీసం పరామర్శించడానికి రాని సీఎం వాళ్లకేదో ఒరగబెడతాడనుకోవడం వృథా అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed