ఉస్మానియా ఆస్పత్రి కూల్చొద్దు: అక్బరుద్దీన్

by  |
ఉస్మానియా ఆస్పత్రి కూల్చొద్దు: అక్బరుద్దీన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని కూల్చొద్దని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చారిత్రక, వారసత్వ కట్టడాలు మన గత చరిత్రకు ఆనవాళ్లని, వాటిని భద్రంగా కాపాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దని సీఎంను కోరారు. ఇలాంటి కట్టడాలే హైదరాబాద్ నగరానికి గొప్ప గుర్తింపు అని, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాలను కట్టుకోవచ్చుగానీ ఉన్నవాటిని మాత్రం కూల్చొద్దన్నారు.

అసెంబ్లీలో కరోనాపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఈ అంశాన్ని లేవనెత్తి సీఎంకు రిక్వెస్ట్ చేశారు. కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న రాపిడ్ యాంటీజెన్ టెస్టులతో పూర్తి ఫలితం రాదని, ఆర్టీపీసీఆర్ టెస్టులకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వమే భరించాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడు ఈ టెస్టులకు అయ్యే ఖర్చును కూడా అందులోనే పేర్కొనాలని ప్రభుత్వానికి అక్బర్ సూచించారు.


Next Story