- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ప్రగతిభవన్లో ప్రత్యేకంగా కలిశారు. అడ్డాకుల మండలం బలిదుపల్లి నుండి సీసీ కుంట మండలం వెంకంపల్లి వరకు రోడ్డు నిర్మాణం సక్రమంగా లేకపోవడం, నియోజక వర్గంలోని సమస్యలు గురించి సీఎం కు ఎమ్మెల్యే తెలిపారు. బిటి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
అలాగే నియోజక వర్గంలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఈ పనులకు నిధులను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని సమాచారం.
Next Story