- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిత్రమా.. మళ్లీ మీతోనే మిత్రోన్!
టిక్‌టాక్‌కి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో తయారైన మిత్రోన్ యాప్‌ను ఇటీవల గూగుల్ తమ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అయితే దీని గురించి వివరణ ఇస్తూ సంబంధిత యాప్ రూపకర్తలు ప్లేస్టోర్ టెక్నికల్ పాలసీ నిబంధనలకు తగినట్లుగా మార్పులు చేసిన తర్వాత తిరిగి మిత్రోన్ యాప్‌కు అనుమతి ఇస్తామని గూగుల్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఆ యాప్ డెవలపర్లకు తమ వంతు సాయం కూడా చేస్తున్నామని ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే వైస్ ప్రెసిడెంట్ సమీర్ సమత్ తెలిపారు. ఇప్పటికే తాము మిత్రోన్ డెవలపర్‌కి ఆ యాప్‌లో ఉన్న టెక్నికల్ సమస్య గురించి వివరించినట్లు, ఆ సమస్యను వారు పరిష్కరించగానే తిరిగి ప్లేస్టోర్‌లో యాప్‌ను పెడతామని ఆయన చెప్పారు.
అలాగే ఇటీవల ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేసిన రిమూవ్ చైనా యాప్స్ యాప్ గురించి సమీర్, గూగుల్ తరఫున వివరణ ఇచ్చుకున్నారు. ఈ యాప్‌ను మళ్లీ ప్లేస్టోర్‌కి తీసుకొచ్చే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా చెప్పారు. థర్డ్ పార్టీ యాప్‌లను డిలీట్ చేయమని చెబుతూ, వినియోగదారుడి డివైజ్ సెట్టింగులను ఆటోమేటిక్‌గా మార్చే ఇలాంటి యాప్‌లను తాము ప్రోత్సహించేది లేదని సమీర్ నొక్కి చెప్పారు. ఒక యాప్ మరో యాప్‌ను డిలీట్ చేయమని చెప్పడం సబబు కాదని, దీనికి విరుద్ధంగా నిబంధనలు తీసుకురావడానికి గూగుల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోందని సమీర్ వివరించారు. ప్లే్స్టోర్‌లో డెవలపర్లు, వినియోగదారుల మధ్య ఉన్న సఖ్యత వాతావరణం ఇలాంటి యాప్‌ల చెడిపోతుందని, ఇప్పటికే ఇలాంటి నిబంధనలు వేరే దేశాల్లో కూడా అమలు చేశామని సమీర్ చెప్పారు. కొద్దికాలంలోనే అత్యధిక డౌన్‌లోడ్లు సంపాదించిన మిత్రోన్, రిమూవ్ చైనా యాప్స్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం వెనక గూగుల్, చైనాతో కలిసి పనిచేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి అధికారికంగా గూగుల్ ఎలాంటి ప్రకటనలు విడుదల చేయనప్పటికీ వాటిని తొలగించడం వెనక గల కారణాలను సమీర్ వివరించడం ఒక రకంగా ఈ వార్తలను గూగుల్ కొట్టిపారేసిందని అర్థం చేసుకోవచ్చు.