- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
10 రోజుల్లో ఐపీఎల్.. అంతలోపే SRHకి షాక్
దిశ, వెబ్‌డెస్క్: మరో 10 రోజుల్లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. 8 జట్లు, ప్రపంచ క్రికెట్‌లోని స్టార్ ఆటగాళ్లందరూ బరిలోకి దిగి పోటీ పడుతుంటుంటే.. చూసేందుకు కనుల పండుగగా ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమై మే 26తో జరగనున్న ఫైనల్‌తో ముగిసే ఐపీఎల్ 2021ను చూసేందుకు క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి అన్ని ప్రాంచైజీలు తమ జట్లలో మార్పులు చేయడంతో.. టోర్నీ మరింత రసవత్తరంగా జరిగే అవకాశముంది.
మరో 10 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో.. కొందరు ఆటగాళ్లు దూరం కావడం ప్రాంచైజీలను కలవరపరుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవ్వడం ఆ జట్టును కలవరపరుస్తోంది. అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసింది.
ఈ క్రమంలో మరో జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌కు ముందు షాక్ తగిలింది. SRH ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బయో బబుల్ జీవితంలో అలసిపోయానని, ఈ సీజన్ ఆడలేకపోతున్నానంటూ SRH యాజమాన్యానికి మిచెల్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.