కారణం లేకుండా చనిపోతున్న కాకులు

by  |
కారణం లేకుండా చనిపోతున్న కాకులు
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. ఈ సమయంలో.. తమిళనాడులోని పన్నియార్ అనే గ్రామంలో వరస పెట్టి కాకులు చనిపోవడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి ఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదంటూ భయపడుతున్నారు.

త‌మిళ‌నాడులోని రాణిపేట జిల్లా ప‌న‌పాక్కం ప‌ట్ట‌ణ స‌మీపంలో ప‌న్నియూర్ అనే గ్రామం ఉన్న‌ది. ఆ గ్రామంలో గ‌త కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి కాకులు చనిపోతున్నాయి. కాకులు వైరస్ సోకిందని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒక‌టిన ఒకేచోట 10 కాకులు చ‌నిపోయాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో వుండడం తో ప్రజలు ఇళ్ళలోనుంచి బయటకు రావడం లేదు. దీంతో ఆహారం లేక కాకులు మరణించి వుంటాయని తొలుత అందరూ భావించారు. కానీ ప్రతిరోజూ అలాంటి ఘటనే ఎదురు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో సంవత్సరాలు గా లేనిది, ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుందోనని భయపడుతున్నారు. ఉన్నట్టుండి ఎందుకు చనిపోతున్నాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. దాంతో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారుల బృందం, కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు ఆ గ్రామానికి వచ్చింది.. కాకుల ఆకస్మిక మృతి వెనుక ఆకలి బాధే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని తేలుస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags: coronavirus, tamil nadu, crow, mystery deaths,


Next Story

Most Viewed