అక్కడ నీరంతా రోడ్డు పాలు.. పట్టించుకోని అధికారులు

by Sridhar Babu |
అక్కడ నీరంతా రోడ్డు పాలు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, శంకర్ పల్లి : మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా నాసిరకంగా పైపులు వేయడంతో ఎక్కడపడితే అక్కడ పైపులు పగిలి పోయి నీరంతా రోడ్డు పాలవుతుంది. ముంబై బెంగళూరు జాతీయ రహదారులకు లింక్ రోడ్డు అయిన కంది షాద్‌నగర్ రోడ్డుపై చేవెళ్ల మండలం కమ్మెట చౌరస్తా వద్ద గురువారం ఉదయం పైప్ లైన్ పగిలి నీరంతా వృధాగా పోతుంది. ఒకవైపు గ్రామాలలో నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడో ఒకచోట పైప్ లైన్ పగిలి పోవడం నీటి సరఫరాకు అంతరాయం కలగడం షరా మామూలుగా తయారయింది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ స్వార్థం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 15 రోజుల క్రితం శంకర్పల్లి చేవెళ్ల రహదారి వెంబడి ఎనికేపల్లి చౌరస్తా వద్ద పైప్ లైన్ పగిలి నీరు అంతా వృధా పోగా ప్రస్తుతం చేవెళ్ల మండలం కమ్మెట చౌరస్తా నర్సారెడ్డి తోట వద్ద మిషన్ భగీరథ పైపు పగిలిపోవడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి నాసిరకంగా పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed