మిషన్ భగీరథ ఏఈ ఆత్మహత్య

by Sumithra |
మిషన్ భగీరథ ఏఈ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలోని బాలనగర్ మండలం మిషన్ భగీరథ ఏఈగా పనిచేస్తున్న శివ ప్రసాద్ (33) ఆదివారం రాత్రి11:30 గంటల ఈ సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత డిసెంబర్ నెల 4వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో వివాహం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివశక్తి నగర్‌లో నివాసం ఉంటున్న ఈ దంపతుల మధ్య ఇటీవల చిన్న చిన్న తగాదాలు జరిగాయి. గత రెండు రోజుల నుండి పరిస్థితులు అలాగే కొనసాగడంతో ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే శివప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Next Story