- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ ఫోటో.. చితకబాదిన బామ్మర్దులు
దిశ, కామారెడ్డి: ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ఫీ ఫొటో చేర్ చేసి కలకలం సృష్టించాడు. అత్తగారింటి నుంచి స్వగ్రామానికి వెళుతూ.. మధ్యతో గొంతుకు టవల్ బిగించుకొని ఫొటో షేర్ చేయడంతో కుటుంబసభ్యులు కలవరానికి గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన రమేష్‌కు దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన రజితతో గతంలో వివాహమైంది. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల వాళ్ల పొలంలో పండించిన ధాన్యం అమ్మగా.. రూ.50 వేలు వచ్చాయి. దీంతో ఈ నగదును రజిత అనారోగ్యంతో ఉన్న తన తల్లికి పంపించింది. అనంతరం తల్లిని పరామర్శించడానికి రమేశ్, రజితి బైక్‌పై ఆదివారం వెళ్లారు. రాత్రి బావమరిదులతో మద్యం సేవించారు.
మద్యం మత్తులో డబ్బు విషయంలో బావామరిదుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రమేశ్ ఇంటికెళ్తున్నాని భార్యతో చెప్పి, ఆ రాత్రే బయలుదేరాడు. కిలోమీటర్ వరకు వెళ్ళాక రమేష్ బావమరిది, మరొక ముగ్గురితో కలిసి రమేష్‌ను తాళ్లతో కట్టేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం రమేష్‌ను చితకబాది బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో వదిలేసి వెళ్లిపోయారని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ దోమకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, దోమకొండ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. రమేశ్ కోలుకున్నాక, పూర్తి విచారణ చేపట్టి, వివరాలు వెల్లడిస్తామన్నారు.