‘మిస్సింగ్’ ఫస్ట్ లుక్ రిలీజ్

by  |
‘మిస్సింగ్’ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మిస్సింగ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. బజరంగబలి క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌ని జోశ్యుల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకు.. భాస్క‌ర్ జోశ్యుల‌, శేష‌గిరిరావు న‌ర్రా సంయుక్తంగా నిర్మిసున్నారు. మిస్సింగ్ సినిమాతో హర్ష నర్రా తొలిసారిగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

మిస్సింగ్‌ టైటిల్‌ ఖరారు చేసిన చిత్ర యూనిట్.. సెర్చింగ్ వర్సెస్ రీవెంజ్ సబ్ టైటిల్‌తో ఆసక్తిని పెంచారు. దీనికి తోడు ఫస్ట్ లుక్ కూడా అభిమానుల్లో ఉత్కంఠ రేపే విధంగా ఉండటం ప్లస్ పాయింట్‌గా మారింది.

శనివారం జులై 13 శనివారం రాత్రి 11.30 గంటలకు కనిపించకుండా పోయి శృతి కోసం.. హీరో (గౌతమ్) చేసిన ప్రయత్నాలు ఫలించాయా.. ఈ కథ ఎన్ని మలుపులు తిప్పింది అన్న కోణంలో చిత్రం ఉత్కంఠ భరిత అనుభూతినిస్తోందని దర్శకుడు తెలిపాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed