- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తల్లి, కూతురు అదృశ్యం.. శనిగపురంలో కలకలం

దిశ, ఖానాపూర్: తల్లీకూతుళ్లు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామానికి చెందిన తోట యశోద(39), తోట అనూష(19)లు తల్లీకూతుళ్లు. వీరిద్దరు కలిసి ఈనెల 8వ తేదీన యశోద సోదరియైన నల్లగుంట్ల సునీత ఇంట్లో శుభకార్యం ఉందని ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి వచ్చారు. శుభకార్యం ముగిసిన తర్వాత ఈ నెల 9 వ తేదీన తిరిగి శనిగపురం వెళ్లేందుకు బుధరావుపేట బస్ స్టాప్‌కు వెళ్లారు. సాయంత్రమైనా వీళ్లు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన యశోద భర్త సురేష్ భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది.
దీంతో కంగారుపడిన సురేష్ తన మరదలు(సునీత) భర్త సత్యనారాయణకు ఫోన్ చేయగా, ఆయన ఉదయం 11 గంటలకే వారిని బస్టాండ్‌లో దింపానని చెప్పాడు. తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసిన సురేష్‌కు ఎంతకీ వారి ఆచూకీ తెలియలేదు. దీంతో చేసేదేంలేక మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై ఖానాపూర్ ట్రైనీ ఎస్సై విశ్వతేజను వివరణ కోరగా, కేసు నమోదు చేసుకున్నామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.