శ్రీశైలం డ్యాం వద్ద తప్పిన పెను ప్రమాదం..!

దిశ వెబ్‎డెస్క్: కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని డ్యాం కంట్రోల్ రూమ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం డ్యాం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచరియలు విరిగిన ప్రదేశంలో జలవనరుల శాఖ ఉద్యోగులు, ఎస్‎పీఎఫ్ పోలీస్ సిబ్బంది, పర్యాటకులు తిరుగుతుంటారు. ఘటనాస్ధలిలో కొండచరియలకు రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement