- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కంటే ‘భయం’ ప్రమాదకరం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా(కోవిడ్ 19) కంటే భయం ప్రమాదకరం. మనదేశంలో కరోనా వైరస్ కేసులు మొత్తం 50 కూడా దాటలేదు కానీ, దేశాన్నంతా ఏదో ఉపద్రవం ముంచేస్తోందన్నట్టు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పోస్టుల మీద పోస్టులు వస్తున్నాయి. పొద్దున లేవగానే.. వాట్సాప్‌లలో గుడ్ మార్నింగ్‌లు పువ్వుల, చిన్నారుల ఫొటోలకు బదులు జంతుకళేబరాలు, ఒళ్లు జలదరించే చిత్రాలు, వింత వింత కథనాలు, ఊహకందని బ్రూటల్ స్టోరీలు చూడాల్సి వస్తున్నది. ఒక విషయం సోషల్ మీడియాలోకి ఎన్ని వెర్షన్‌లలో చేరుతుందంటే.. అందులో వాస్తవమైనదేదో గుర్తుపట్టలేం. ఇంతకు ఇప్పుడు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నంత ప్రమాదాన్ని నిజంగానే కరోనా వైరస్‌తో మనం ఎదుర్కొంటున్నామా? అంటే కాదనే తెలుస్తోంది.
కరోనా వైరస్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఇన్నాళ్లూ వాతావరణంలో ఉన్నది. ప్రపంచాన్ని వణికించిన సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(ఎస్ఏఆర్‌ఎస్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(ఎంఈఆర్‌ఎస్) ఇన్ఫెక్షన్ డిసీజ్‌లు ఈ వైరస్‌తోనే ప్రబలాయి. ఈ కామన్ వైరస్‌ను సూపర్ మార్కెట్‌లో దొరికే సాధారణ హ్యాండ్‌వాష్ లిక్విడ్‌లు చంపేసేవి కూడా. కానీ, ఈ సారి చైనా వుహాన్‌లో వెలుగుచూసిన ఈ డిసీజ్ కోవిడ్ 19 వైరస్‌తో వ్యాపిస్తున్నది. కానీ, ఎస్ఏఆర్ఎస్ ఎంత ప్రమాదకరమంటే.. అది సోకినవారిలో పదిశాతం మంది చనిపోయారు. అంటే మరణాల రేటు పది శాతంగా నమోదైంది. ఎంఈఆర్ఎస్ వల్ల మరణాల రేటు 34 శాతంగా నమోదైంది. కానీ, కోవిడ్ మరణాల రేటు ఎంతో తెలుసా? కేవలం 3.4 శాతం. వుహాన్‌లో తొట్టతొలిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడు కోవిడ్ 19 మరణాల రేటు 17 శాతం ఉండగా.. ఇప్పుడు 5.8 శాతంగా ఉన్నది. వుహాన్ మినహా చైనా మొత్తం ఈ వైరస్ ద్వారా మరణాల రేటు కేవలం 0.7 శాతం మాత్రమే. కోవిడ్ 19 సోకడానికి ముందు శ్వాసకోస వ్యాధులు, ఇతరత్ర వైరస్‌లు ఏవైనా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడే సదరు వ్యక్తి చనిపోయే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మొదటి రెండు వైరస్‌లు వ్యాపించినప్పుడు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా లేదు. తప్పుడు సమాచారం(మిసిన్ఫర్మేషన్) లేదు. ఇప్పుడు ఈ రెండు విచ్చలవిడిగా జరుగుతున్నది. అందుకే ఇంతటి భయాందోళనలు.
అదీగాకుండా భారతీయులకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. 2003లో ఎస్ఏఆర్ఎస్ 29 దేశాలను చుట్టేస్తే మనదేశంలో కేవలం ముగ్గురికి వచ్చింది. వారు కూడా తర్వాత రికవరీ అయ్యారు. ఎంఈఆర్ఎస్ అయితే భారత్ దరికే రాలేదు. వుహాన్‌లో కోవిడ్ 19 పీక్‌లో ఉన్నప్పుడు స్వదేశానికి తీసుకొచ్చిన 327 ఇండియన్లలోనూ ఈ వైరస్ లక్షణాలు లేకపోవడం ఒక్కటి చాలదా.. మన శక్తి సామర్థ్యాలేంటో అంచనా వేసుకోవడానికి..? ఇది చాలదంటే మరో స్టాటిస్టిక్స్‌ను పరిశీలిద్దాం. 2010-11 నుంచి 2018-19 మధ్య కాలంలో ఫ్లూ వైరస్‌తో అమెరికాలో 3.37 లక్షల మంది చనిపోతే, మనదేశంలో 11 వేల మంది మరణించారు.
వైరస్ సోకిన వ్యక్తి మన ముఖం మీద తుమ్మితేనో, దగ్గితేనో తప్పితే మాస్క్‌తో పనేలేదు. కానీ, ఇప్పుడు మాస్క్‌ల కోసం బ్లాక్‌గా ఆరేడు రెట్లు ఎక్కువగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ వైరస్ ఉపరితలం నుంచి మనలోకి చేరుతుంది కానీ, గాలిలో అలా తేలియాడే వైరస్ కాదు. వాస్తవానికి మాట్లాడేటప్పుడో.. మరే అవసరానికో తరచూ మాస్క్‌ను జరిపేందుకు మన చేతులతో ఎక్కువసార్లు ముఖాన్ని తాకుతాం. అనేక వస్తువులను సాధారణంగా పట్టుకునే క్రమంలో చేతికి వైరస్ చేరితే.. మాస్క్‌ను అడ్జస్ట్ చేసే క్రమంలో ఈ వైరస్ సోకే అవకాశమెక్కువగా ఉంటుంది. నిజానికి మన నుంచి వైరస్ ఇతరులకు సోకకూడదు అనుకున్నప్పుడు మాస్క్ సరిగ్గా ఉపయోగపడుతుంది. అందుకే కరోనా వైరస్(కోవిడ్ 19) గురించి లేనిపోని ఊహాత్మక కథనాలో, భయాలో నింపుకుని దిగాలుగా ఉండాల్సిన అవసరం లేదు. తరచూ చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండేందుకు ఉపక్రమించి.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
Tags: coronavirus, fake, misinformation, masks, prevention, immune, indians