- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం..
దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకుని తీరుతామని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మంత్రులు ఫీల్డ్ విసిట్ చేశారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు పనుల పురోగతిపై వివరించారు. వీరి వెంట రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ హాజరయ్యారు. నార్లాపూర్ ఏదుల పంప్ హౌస్ రిజర్వాయర్లు వంటి పనులను స్వయంగా పరిశీలించారు. మ్యాప్ ద్వారా మంత్రులకు పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్ కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తి వంటి ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా, నల్గొండ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని సాగు భూములను బంజరు భూములుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ విసిట్‌లో ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.