- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయినిని పరామర్శించిన మంత్రులు
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. నాయిని నర్సింహారెడ్డి త్వరగా కోలుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు.
సెప్టెంబర్ 30వ తేదీన కరోనా బారిన పడిన నాయిని నర్సింహరెడ్డి.. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కాగా, ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు.