కేసీఆర్ చొరవతోనే కులవృత్తుల పునర్జీవం: తలసాని

by Shyam |
కేసీఆర్ చొరవతోనే కులవృత్తుల పునర్జీవం: తలసాని
X

దిశ, వనపర్తి: కేసీఆర్ పాలనలో కుల వృత్తులు మళ్లీ అభివృద్ధి బాటలోకి వస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో రూ. 33 లక్షల 50 వేలతో నిర్మించబోయే నూతన ప్రాంతీయ పశు వైద్యశాల భవన నిర్మాణ పనులకు.. మంత్రులు తలసాని, సింగిరెడ్డి, ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్‌‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలకేంద్రం ఆవరణలోని పశువుల సంత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర పాలనలో కనుమరుగైపోయిన కులవృత్తులు సీఎం కేసీఆర్ పాలనలో పునర్జీవం పోసుకుంటున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

సింగిరెడ్డి చొరవతో..

అనంతరం క్రిప్‌కో-వ్యవసాయ శాఖ సమన్వయంతో 60 మంది రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు, ప్రాసెసింగ్ ఆవశ్యకతపై అవగాహన కల్పించడంలో భాగంగా.. రెండు రోజులు అశ్వారావుపేటలో క్షేత్ర సందర్శనకు వెళ్లే బస్సులను మంత్రి సింగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, అదనపు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, క్రిప్‌కో సంస్థ ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed