పాలమూరు సుందరీకరణపై మంత్రి సమీక్ష

by Shyam |
పాలమూరు సుందరీకరణపై మంత్రి సమీక్ష
X

దిశ, మహబూబ్ నగర్ :
మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న మినీ శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్‌ల అభివృద్ధి‌పై హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులతో ఆబ్కారీ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా పట్టణాభివృద్ధి, సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మినీ శిల్పారామం, ట్యాంక్ బండ్‌ల అభివృద్ధితో పాటు, పిల్లల కోసం ఆధునిక టాయ్ ట్రైన్ ఏర్పాటు పై ప్రధానంగా చర్చించారు.అలాగే మినీ శిల్పారామంలో నిర్వహించే కార్యక్రమాలు, కన్వెన్షన్ సెంటర్, స్టాళ్ళు, ఫుడ్ కోర్టులతో పాటు మినీ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేసే ఎంటర్ టైన్మెంట్ జోన్ల అభివృద్ధి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తగు డిజైన్లను, అందుకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టును వారం రోజుల్లో రూపొందించాలని టూరిజం శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.సమీక్షలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు,అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పై చర్చించారు. సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక కేంద్రాలను పబ్లిక్, ప్రవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో మౌళిక వసతులు కల్పన కోసం అభివృద్ధి చేయాలని, అందుకు అవరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్, టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, కన్సల్టెంట్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed