లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by  |
లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
X

దిశ, మహబూబ్ నగర్: ప్రజలను కాపాడేందుకు మేము సైతం అంటూ పోలీసు అవతారం ఎత్తారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులతోపాటు ప్రజాప్రతినిధులపై కూడా ఉందని చెప్పిన విషయం విధితమే. దీన్ని మంత్రి తూచా తప్పకుండా అమలు చేశారు. బుధవారం లాక్ డౌన్‌ను సమీక్షించే క్రమంలో లాఠీ పట్టుకున్నారు. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులు, పాదచారులను ఆపి ఎందుకు రోడ్డు పైకి వచ్చారో ఆరా తీశారు. అసలు ప్రభుత్వం లాక్ డౌన్ ఎందుకు అమలు చేస్తోంది ? దీనివల్ల ఏం జరుగుతుంది ? అనే దానిపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మరోసారి అనవసరంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మంత్రి రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరించారు.

మూడు తాత్కాలిక రైతు బజార్లు

ప్రజావసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో మూడు చోట్ల రైతుబజార్లను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. బస్టాండు, రామయ్య బౌలి దగ్గర, మెట్టుగడ్డ, కొత్తగా రైతుబజార్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా ప్రాంతాలను సందర్శిచి సూచనలు చేశారు.

tags : corona virus out break,lockdown, minister srinivas goud, doing police duty


Next Story