- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేద బ్రాహ్మణులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డుకాలనీలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేసి రూ.100 కోట్లను కేటాయించామన్నారు. రూ.1400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అంతేకాక వేములవాడ, బాసర, మన్యంకొండ, కురుమూర్తి ఆలయాలకు రూ.కోట్లు వెచ్చిం చి అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. జూన్ 27తో పీవీకి వందేళ్లు నిండాయన్నారు. పీవీ దేశానికి ఎన్నో సేవలందించినప్పటికీ పార్లమెంట్‌లో ఆయన విగ్రహం కూడా లేదన్నారు. దీన్నిదృష్టిలో పెట్టుకొని జూన్ 28 నుండి ఏడాది పాటు రాష్ట్రంలో పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు రాంప్రసాద్ , కౌన్సిలర్లు యాదమ్మ, వనజ, రామాంజనేయులు, మన్యంకొండ దేవాలయం కమిటీ సభ్యులు వెంకట్రావు పాల్గొన్నారు.