వసతులు సద్వినియోగం చేసుకుని రాణించాలి

by Shyam |   ( Updated:2020-07-22 07:51:44.0  )
వసతులు సద్వినియోగం చేసుకుని రాణించాలి
X

దిశ, మహబూబ్‌నగర్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి శ్రీ నివాస్ గౌడ్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల వసతులు మీరంతా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని, వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా వసతులు కల్పించడం జరిగినదని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌లాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మెడికల్ కళాశాల, యూనివర్సిటీ తీసుకురావడం జరిగినదన్నారు.

Advertisement

Next Story