విదేశాల నుంచి ప్రయాణికులు రావడంతోనే…

by Shyam |
విదేశాల నుంచి ప్రయాణికులు రావడంతోనే…
X

దిశ, మహబూబ్ నగర్: కరోనాను నియంత్రించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విదేశాల నుంచి ప్రయాణికులు వస్తుండటంతో కరోనా మహమ్మారి కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు తెలిపారు. కరోనా విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతతో ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అపోహలు సృష్టించే వారిపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. సింగపూర్‌లో చిక్కుకున్న వారిని మన దేశానికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 33 మందిని క్వారంటైన్ చేసినట్లు పేర్కొన్నారు. 2000 బెడ్స్‌తో క్వారంటై వార్డులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Tags: minister, srinivas goud, corona, press meet, ts news

Advertisement

Next Story

Most Viewed