- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతు కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని కృష్ణా నది నీళ్లతో ఖాన్ చెరువు నింపాలని దీక్షతో పనిచేశామని, రాబోయే రోజులలో ఖాన్ చెరువుకు కరువుండదన్నారు. జూరాల నిండితే ఖాన్‌చెరువు నిండినట్లే అని, దీని కింద 1500 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. రూ.79 లక్షలతో లిఫ్ట్ ఏర్పాటు చేశామని కావున గ్రామస్తులు కమిటీగా ఏర్పడి దీనిని జాగ్రత్తగా నడుపుకోవాలని సూచించారు. చెరువు కింద పంటలు పండిన తరువాత రైతులు గ్రామ దేవతల పేరు మీద అన్నదానం నిర్వహించాలని కోరారు.
రైతులు సాంప్రదాయ పంటలు విడిచిపెట్టి, తెలంగాణలో కొన్ని సీజన్లలో కొత్తిమీర, పుదీన, టమాట, మిరపకాయ్ వంటివి దొరకడం లేదని, ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాలని సూచించారు. పెద్దగూడెం లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి ఖాన్ చెరువుకు చేరిన నీటితో గ్రామంలోని కోదండరామస్వామికి అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం మెంటేపల్లి గ్రామ పరిధిలోని రాఘవేంద్రనగర్ లిఫ్ట్‌ను ప్రారంభించి 50 ఎకరాలకు నీళ్లందించే రాసాలకుంటలో కృష్ణానీళ్లకు పూజచేశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ నిర్మాణానికి సహకరించిన, పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.