జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేస్తాం

by  |
జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేస్తాం
X

దిశ, న్యూస్‌బ్యూరో: జీవో నెంబర్ 3ను పునురుద్ధరించేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. సోమవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ సంప్రదింపుల ద్వారా జీవో నెంబర్ 3పై నివేదిక రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు, సూచనలతో డ్రాఫ్ట్‌ని తయారు చేశామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ములుగు జిల్లా జాకారంలో భూ కేటాయింపులు జరిగాయన్నారు. భవనాలు నిర్మాణం అయ్యేలోపు తాత్కాలికంగా తరగతులు ప్రారంభించడానికి వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. విశ్వవిద్యాలయం తరగతుల ప్రారంభంలో జరుగుతున్న జాప్యం వల్ల గిరిజన విద్యార్థులు విద్యా సంవత్సరాన్నికోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే కేంద్రాన్ని సంప్రదించి, ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకుని తరగతులు ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.


Next Story